News March 24, 2025

నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. క్షీణిస్తున్న మానసిక, శారీరక ఆరోగ్యం కారణంగా ఆయన ఇకపై పాలించడానికి తగినవారు కాదని అన్నారు. ‘నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్. ఎవరికైనా డౌట్ ఉంటే మంత్రుల పేర్లు చెప్పమని అడగండి. ఆయన పరిస్థితి గురించి ప్రధాని మోదీ, అమిత్ షాకు తెలియదంటే నమ్మలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News October 18, 2025

సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జాబ్ ఛార్ట్‌తో పాటుగా కొన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల డేటా సేకరణ, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, సేవలు చేర్చాలని, సచివాలయాలకు వచ్చిన వినతుల పరిష్కారం, విపత్తుల సమయంలో హాజరు, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని పేర్కొంది. ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

News October 18, 2025

రాంగోపాల్ వర్మపై కేసు

image

AP: డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాజమండ్రి 3టౌన్ PSలో కేసు నమోదైంది. హిందూ దేవుళ్లు, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులను ఓ ఇంటర్వ్యూలో దూషించారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వప్నపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా క్రైమ్ నంబర్ 487/2025 కింద కేసు నమోదైంది. గతంలోనూ RGVపై పలు సందర్భాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News October 18, 2025

DDAలో 1,732 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, Jr ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://dda.gov.in/. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.