News October 2, 2024

నితీశ్ కుమార్ ఫిట్‌గా లేరు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్‌కు ఆసరా ఇస్తోందని దుయ్య‌బట్టారు. ప్ర‌జా జీవితం నుంచి త‌ర‌చుగా ఆయ‌న గౌర్హాజ‌రు, భూ స‌ర్వే, వ‌ర‌ద‌లు, స్మార్ట్ మీట‌ర్ల బిగింపు వంటి కీల‌క విష‌యాల‌పై మౌనాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

3 సార్లు ‘ఓట్ చోరీ’ చేశారు.. రాహుల్‌కు BJP కౌంటర్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఎక్కువ మద్దతు ఉన్న సర్దార్ పటేల్‌ స్థానంలో నెహ్రూ ప్రధాని అయినప్పుడు ఓట్ చోరీ జరిగింది. కోర్టు తీర్పు తర్వాత కూడా ఇందిరా గాంధీ ఎన్నికవడం వివాదాస్పద అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం లేకుండానే ఓటరు అయ్యారు’ అని ట్వీట్ చేసింది. రాహుల్ ఫేక్ ప్రాపగండాను తాము క్లీన్ చేస్తున్నామని మండిపడింది.

News December 15, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తూ బ్రహ్మే నిర్వహిస్తాడని నమ్మకం. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవాల్లో ముందు నడిచేది బ్రహ్మ రథమే. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. నారాయణుడికి సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు, హనుమంతుడు వంటి దేవతలు, పక్షులు, జంతువులు వాహన సేవ చేస్తాయి. ఇది ప్రకృతిలోని సర్వశక్తులు, సకల జీవులు స్వామివారికి సేవ చేయడాన్ని సూచిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 15, 2025

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>పవర్‌గ్రిడ్<<>> కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 48 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI)లో అసోసియేట్ మెంబర్ అయి ఉండటంతో పాటు ఏడాది పాటు పని అనుభవం గల వారు DEC 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 29ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.powergrid.in