News December 8, 2024

సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి

image

నితీశ్ కుమార్ రెడ్డి పేరు నెట్టింట మారుమోగుతోంది. అనుభవజ్ఞులతో కూడిన భారత జట్టులో ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్ ఆడుతున్న అతనొక్కడే పోరాడటం దీనిక్కారణం. తొలి టెస్టులో 41, 38, రెండో టెస్టులో 42, 42 రన్స్‌తో జట్టును నితీశ్ ఆదుకున్నారు. ఇక అడిలైడ్ టెస్టు భారత రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ ఆదుకోకపోతే టీమ్ ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలై ఉండేది. నితీశ్ ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో మూడింట అతడే టాప్ స్కోరర్.

Similar News

News October 17, 2025

రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

image

TG: రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా BC సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి INC, BRS, BJP, CPI, CPM సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

News October 17, 2025

రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

image

ట్రంప్‌కు PM మోదీ భయపడుతున్నారంటూ LoP రాహుల్ గాంధీ చేసిన <<18020106>>విమర్శలపై<<>> US సింగర్, నటి మేరీ మిల్‌బెన్ సెటైర్లు వేశారు. ‘రాహుల్‌ మీరు రాంగ్. ట్రంప్‌కు PM మోదీ భయపడటం లేదు. ఆయనకు ఈ లాంగ్ గేమ్‌పై అవగాహన ఉంది. USతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ లాగే మోదీ కూడా తమ దేశానికి ఏది ముఖ్యమో అదే చేస్తున్నారు. దేశాధినేతలు అలాగే చేస్తారు. ఇది మీకు అర్థం కాదు. మీకు PM అయ్యేంత చతురత లేదు’ అని ట్వీట్ చేశారు.

News October 17, 2025

TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

image

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.