News December 25, 2024
నితీశ్, నవీన్కు భారతరత్న దక్కాలి: కేంద్రమంత్రి
భారతరత్న పురస్కారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అర్హులని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ తమ రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వారికి భారతరత్న వంటి అవార్డులు దక్కడం సముచితం. బిహార్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే సర్కారే వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 26, 2024
కొత్త ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉంది.
News December 26, 2024
నేడు కర్ణాటకకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా బెల్గాంలో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. అందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
News December 26, 2024
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
AP: క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగింది. అంగలూరికి చెందిన కొమ్మాలపాటి సాయి(26) HYDలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటికి వచ్చి స్నేహితులతో క్రికెట్ మ్యాచ్కు వెళ్లాడు. బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే గుడివాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.