News March 30, 2025

నితీశ్ రాణా విధ్వంసం..

image

IPL-2025: చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జైస్వాల్ (4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా బౌండరీలతో వీరవిహారం చేస్తున్నారు. 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 58* రన్స్ చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 6 ఓవర్లలో 79/1గా ఉంది.

Similar News

News April 1, 2025

CBN, లోకేశ్, పవన్‌పై వైసీపీ ‘ఏప్రిల్ ఫూల్’ ట్వీట్

image

AP: ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్‌కు పాల డబ్బా, పవన్‌కు రిమోట్‌ను సింబల్స్‌గా పెట్టి వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడ్‌ను ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్‌తో 100% తగ్గింపును పొందండి’ అని రాసుకొచ్చింది.

News April 1, 2025

దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?

image

దోమలు అందరిపై ఒకేలా దాడి చేయవు. ఎందుకంటే వాటికీ ఓ టేస్ట్ ఉంది. దోమలు ‘O’ గ్రూప్ రక్తాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని ఓ పరిశోధనలో తేలింది. అందుకే O గ్రూప్ వ్యక్తులను ఎక్కువగా, A రకం వాళ్లని తక్కువగా కుడతాయి. అలాగే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా కీలకం. అవి చెమటతో కలిసినప్పుడు విడుదల చేసే వాసన దోమలను ఆకర్షించడమో, తిప్పికొట్టడమో చేస్తుంటాయి. గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై దోమల ప్రభావం ఎక్కువ అని తేలింది.

News April 1, 2025

400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం: భట్టి

image

TG: HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలను HCUకి మరో చోట కేటాయించింది. ఈ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నాం. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి’ అని సూచించారు.

error: Content is protected !!