News December 7, 2024
నితీశ్ రెడ్డిలో భయం లేదు: సునీల్ గవాస్కర్

భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ‘నితీశ్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. పరిస్థితులకు తగ్గట్టుగా సరైన సమయంలో ఎదురుదాడి చేశారు. భారత క్రికెట్కు మున్ముందు మంచి ఆటగాడవుతారు. వయసు 22 ఏళ్లే అయినా ఏమాత్రం భయం లేకుండా బ్యాటింగ్ చేశారు. ఆ రివర్స్ స్కూప్ షాట్ అద్భుతం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
GOOD NEWS.. HYDకు రూ.300 కోట్లు

GHMCకి ప్రభుత్వం శుభవార్త చెప్పంది. 150 డివిజన్లకు రూ.300 కోట్లు ప్రకటించినట్లు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో GHMC ఎలక్షన్స్ రానున్నాయని, ఈ లోపు పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. మొదట సీఎం 150 డివిజన్లకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తామన్నారన్నారు. అవి సరిపోవని చెప్పడంతో మరో రూ.150కోట్లు కేటాయించారని స్పష్టంచేశారు.
News November 25, 2025
ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.


