News June 26, 2024

నితీశ్ రెడ్డికి గాయం.. జింబాబ్వే పర్యటనకు దూబే ఎంపిక

image

జింబాబ్వే <<13502519>>పర్యటనకు<<>> భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. గాయం కారణంగా నితీశ్‌‌ ఈ టోర్నీలో ఆడట్లేదని BCCI వెల్లడించింది. అతని ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
TEAM: గిల్(C), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్, రింకూ, సంజు, జురెల్(WK), పరాగ్, దూబే, సుందర్, బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్, ముకేశ్, తుషార్

Similar News

News November 17, 2025

భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

image

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రకటించింది. రేపట్నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం(08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖ(08540) మధ్య స్లీపర్, 2AC, 3AC బోగీలతో నడవనున్నాయి. ఇవి రాజమండ్రి, VJA, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది.

వాట్సాప్‌లోనే ‘మీ సేవ’లు!

image

TG: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్‌ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేదా? అప్రూవ్ అయితే సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ఈ సేవలను లాంచ్ చేయనున్నారు.