News December 29, 2024
నితీశ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: గవాస్కర్
తాను ఎక్కడి నుంచి వచ్చానన్న సంగతిని నితీశ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సూచించారు. ‘ఇది నితీశ్‌కు తొలి సెంచరీ. మున్ముందు ఇలాంటి మరెన్నో సాధిస్తారు. భారత క్రికెట్‌కు ఇప్పుడు అతనో స్టార్. కానీ ఎప్పుడూ క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. కుటుంబం తన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదు. మూలాల్ని మరచిపోకుండా ఉంటే అతడికి ఉజ్వలమైన కెరీర్ ముందుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 29, 2024
ఆ రైలు వేగం గంటకు 450 కి.మీ
గంటకు గరిష్ఠంగా 450 KM వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలును చైనా పట్టాలెక్కించింది. CR450 రైలుకు Sun ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇంజిన్ పరీక్షల్లో 400 KM అందుకుంది. గతంలో ప్రవేశపెట్టిన CR400 కంటే 20% ఇంధనాన్ని తక్కువ వినియోగిస్తూ, 12% బరువు తక్కువ ఉండే CR450 బీజింగ్ నుంచి షాంఘైకి (1,214 KM) రెండున్నర గంటల్లో చేరుకోగలదు. ఇది ప్రపంచంలోనే వేగంగా నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుకెక్కనుంది.
News December 29, 2024
ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదులు హతం
JKలో ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. వీరిలో 60% మంది పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టు ఆర్మీ వెల్లడించింది. ఈ ప్రాంతంలో కేవలం నలుగురు స్థానికుల్ని రిక్రూట్ చేయడం ద్వారా భారత్‌పై బయటిశక్తుల్ని ఎగదోయడంలో పాక్ పాత్ర స్పష్టమవుతోంది. హతమైన 75 మంది ఉగ్రవాదుల్లో మెజారిటీ విదేశీయులే ఉన్నారు. కొందరు LOC వద్ద చొరబడేందుకు యత్నించగా ఆర్మీ ఎన్కౌంటర్ చేసింది.
News December 29, 2024
విద్యార్థులకు శుభవార్త
AP: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. ₹206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.