News June 15, 2024
అధికారం కోసమే నితీశ్ మోదీ కాళ్లను తాకారు: ప్రశాంత్ కిశోర్
బిహార్ CM నితీశ్ కుమార్ PM మోదీ కాళ్లను తాకి ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు. ‘నేను గతంలో నితీశ్తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరు. అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు. ఇప్పుడు NDAలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదు’ అని విమర్శించారు.
Similar News
News December 26, 2024
బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.
News December 26, 2024
సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం
TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.
News December 26, 2024
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
TG: సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.