News March 17, 2024
నిజామాబాద్: టెన్త్ పరీక్షలు.. 141 కేంద్రాలు ఏర్పాటు

10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు DEO దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్ష కేంద్రాల్లో 22281 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలలో CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పగడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు.141 సిట్టింగ్స్ బృందాలు నియమించామన్నారు. రేపటి నుంచి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
Similar News
News January 24, 2026
మాక్లూర్ మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. మాక్లూర్(M) మదన్ పల్లె 9.2°C, కోరాట్ పల్లి 9.6, బెల్లాల్ 9.7, చిన్న మావంది 12.6, నిజామాబాద్ 13.7, సాలురా, తుంపల్లి, పొతంగల్ 13.9, మోస్రా, బాల్కొండ, డిచ్పల్లి, ఏర్గట్ల 14.4, మెండోరా 14.5, కమ్మర్పల్లి 14.6, జకోరా, వేల్పూర్, కోటగిరి 14.7, వేంపల్లి, భీమ్‌గల్, కోనసముందర్, జానకంపేట్ 14.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 24, 2026
నిజామాబాద్: ఎన్నికల అధికారులకు శిక్షణ

నిజామాబాద్‌లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
News January 23, 2026
NZB: 24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

సిద్దిపేటలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల కోసం జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయ్ కాంతారావు తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


