News March 18, 2024
నిజామాబాద్: కన్నతల్లి పై కొడుకు కర్కశత్వం

నిజామాబాద్‌లోని గౌతమ్ నగర్‌లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని చేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. గంగామణి వద్దకు పవన్ కుమార్ వచ్చి కన్నతల్లి పై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.
Similar News
News April 5, 2026
సిరికొండ: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

సిరికొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం సర్‌పల్లితండాకు చెందిన మాలవత్ రమేశ్ చేపలు పట్టేందుకు వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ ఆదివారం తెలిపారు.
News April 5, 2026
NZB: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే!

గడచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. వేంపల్లె, నిజామాబాద్ సౌత్ 40.1°C, కోటగిరి 40°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని అన్నిప్రాంతాల్లో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న సాయంత్రం జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. జానకంపేటలో 26.8 మి.మీ, సిరికొండ, సాలూరలో 10 మి.మీ. వర్షం కురిసింది.
News April 5, 2026
NZB: హస్తంలో రగులుతున్న రాజకీయ సెగలు

నిజామాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న ధర్మపురి సంజయ్‌కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన గుర్తింపు దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్న అభిమానులు, నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. బలమైన ఓటు బ్యాంకు కలిగిన నేత కావడంతో, ఆయన పార్టీ వీడితే నష్టం తప్పదని కేడర్ ఆందోళన చెందుతోంది.


