News July 2, 2024

NKD: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

image

మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. నారాయణఖేడ్ నుంచి కారులో వెళ్లిన రఫిక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ పుణే సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 8, 2026

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్‌

image

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం అక్కన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్, బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన అందించాలన్నారు.

News January 8, 2026

మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

image

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్‌ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News January 8, 2026

గ్రామాభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర: కలెక్టర్

image

గ్రామాల ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పంచాయతీ నిధులను వినియోగించి అభివృద్ధి సాధించాలన్నారు. పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, ఈనెల 8 నుంచి 11 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.