News April 26, 2024

NKL: విషాదం.. వడదెబ్బతో టీచర్ మృతి

image

నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న బోడ ఆశ్రిత వడదెబ్బతో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా అడ్మిషన్స్ కోసం ఎండలో క్యాంపెయిన్ చేస్తూ అస్వస్థకు గురై.. మృతి చెందింది. ఈ ఘటనతో అమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎండ తీవ్రతకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News September 30, 2024

NLG: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు

image

NLG- KMM- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.

News September 30, 2024

యాదాద్రి కొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 12 తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

News September 30, 2024

సమగ్ర కుల జనగణన చేయాలి: తీన్మార్ మల్లన్న

image

సమగ్ర కుల జనగణన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం సమగ్రకుల జన గణన సాధనకై బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో ఉద్యోగులు, మేధావులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయకపోతే, 42 శాతం రిజర్వేషన్లకు బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత అని అన్నారు.