News February 9, 2025
NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739070696402_50283763-normal-WIFI.webp)
చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News February 11, 2025
కాంగ్రెస్ షోకాజ్ నోటీసును పట్టించుకోను: తీన్మార్ మల్లన్న
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739202080055_18661268-normal-WIFI.webp)
కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసును పట్టించుకోనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే షోకాజులు అని మండిపడ్డారు. అభ్యర్థులు పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్కు బీసీలు ఓట్లు వేసుకున్నా బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారికి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
News February 11, 2025
NLG: బ్రాహ్మణ వెల్లంలను పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739199926361_20472010-normal-WIFI.webp)
బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ బ్యాంకు కెనాల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వారం రోజుల్లో అమరవాణి, అప్పాజీపేట దోమలపల్లి, కాకులకొండారం, నర్సింగ్ బట్ల చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఉదయ సముద్రం ఎడమ కాలువ పనులను సైతం పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News February 10, 2025
నల్గొండ: బైక్తో గేదెను ఢీకొని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739152197194_19375231-normal-WIFI.webp)
కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుర్రంపోడు మండలం మునింఖానిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ (27) మల్లేపల్లి నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ గేదెను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.