News January 21, 2025

NLGలో కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి

image

NLGలో సోమవారం అంతా పొలిటికల్ హైడ్రామా నడిచింది. BRS మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారపక్షం ధర్నాను అడ్డుకుంటుందని MLA జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అథమ స్థాయికి దిగజారాయని మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. పథకాలను డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారన్నారు. వీరి వ్యాఖ్యలపై మీ కామెంట్.

Similar News

News February 7, 2025

పేదలకు మైరుగైన వైద్యం అందించాలి: ఇలా త్రిపాఠి 

image

నల్గొండ సమీపంలోని రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలతోపాటు పేద ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లను, సౌకర్యాలను పరిశీలించారు.

News February 6, 2025

చిట్యాల వద్ద రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి

image

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్‌ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 6, 2025

NLG: దేవుడా.. అప్పుడే మండుతున్న ఎండలు

image

చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. బుధువారం నల్గొండ (D) అనుముల మం. ఇబ్రహీంపేటలో 37.4, యాదాద్రి (D)బొమ్మలరామారంలో 37.3, సూర్యాపేట (D) నూతన్‌కల్‌లో 37.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంపూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఈ విచిత్ర వాతావరణంలో ప్రజలులు అవస్థలు పడుతున్నారు.

error: Content is protected !!