News June 8, 2024
NLG: అంగన్వాడీల్లో ఆంగ్లంలో బోధన..!

ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో బోధన చేయనున్నారు. ఈ సందర్భంగా మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల్లో యూకేజీ, ఎల్కేజీకి సంబంధించిన పుస్తకాలు, నోట్బుక్స్ తో పాటు యూనిఫాం కూడా అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
నల్గొండ: డీసీసీ ప్రెసిడెంట్గా నియామకపత్రం అందుకున్న పున్న కైలాశ్

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా పున్న కైలాశ్ నేత నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
News December 3, 2025
NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
News December 2, 2025
నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.


