News July 21, 2024
NLG: అంగన్వాడీల అప్ గ్రేడ్..! ఇక ప్రీ స్కూల్ విద్య
అంగన్వాడీలను చిన్నారులకు మరింత చేరువ చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇది అమలు అయితే ఈ సెంటర్లు ఇకపై ప్రైవేట్ ప్లే స్కూల్స్ కు దీటుగా ప్రీ స్కూల్ విద్యను అందించనున్నాయి. సీఎం నిర్ణయంతో ఇన్ని రోజులు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించిన ఈ కేంద్రాలు ఇకపై పిల్లలకు మూడో తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించనున్నాయి.
Similar News
News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి
చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి
చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
News November 25, 2024
NLG: డిగ్రీ పరీక్ష వాయిదా
రేపు (మంగళవారం) జరగవలసిన డిగ్రీ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలని కోరారు.