News September 11, 2024
NLG: అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు.!

NLGలో 8 మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని గతేడాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్టులు అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 22, 2025
NLG: మద్యం దుకాణాలకు 4,629 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు మంగళవారం మరో 9 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,629 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
News October 22, 2025
నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?
News October 22, 2025
ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం కింద క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనులకు గాను ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన ఛాంబర్లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్లను అభినందించారు.