News April 4, 2025
NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Similar News
News April 5, 2025
అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్: మంత్రి కోమటి రెడ్డి

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నల్గొండ పమర్రి గూడ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News April 5, 2025
నాగార్జునసాగర్: కిడ్నాప్.. వ్యక్తి హత్య

నాగార్జునసాగర్‌లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.
News April 5, 2025
NLG: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కోదాడలో నల్గొండ మండాలనికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. దోనకల్ గ్రామానికి చెందిన సైదులు(31) బోర్‌వెల్స్‌లో పని చేస్తూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం కోదాడకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం సైదులుకి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.