News December 26, 2024

NLG: అటు ముసురు.. ఇటు చలి తీవ్రత

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది. చలి తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News January 7, 2026

నల్గొండ మున్సిపాలిటీది ఘనచరిత్ర

image

నల్గొండ మున్సిపాలిటీకి ఘనచరిత్రే ఉన్నది. నల్గొండను 1951లో 12 వార్డులతో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం.. పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2గా.. 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1గా అప్ గ్రేడ్ చేశారు. 2018లో గ్రేడ్ 1గా ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 2.5 లక్షల మేర జనాభా ఉన్నది.

News January 7, 2026

నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

News January 6, 2026

యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

మిర్యాలగూడ మండలం తుంగపాడులోని NDR యూరియా గౌడన్, NDCMS ఎరువుల దుకాణాలను మంగళవారం నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. యూరియా యాప్‌ రైతులు ఎలా వాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు నిత్యం యూరియా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, వ్యవసాయ అధికారులు ఉన్నారు.