News December 26, 2024
NLG: అటు ముసురు.. ఇటు చలి తీవ్రత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది. చలి తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News January 20, 2025
NLG: ఒక్క యాప్‌తో వివరాలు మీ చేతిలో..
విహారయాత్రలు, దైవదర్శనాల సమాచారం కోసం ప్రభుత్వం మీ టికెట్ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి సాగర్ బోటు ప్రయాణానికి సంబంధించిన వివరాలు, బుద్ధవనం, యాదగిరిగుట్ట ఆలయం, మిర్యాలగూడ చెరువులోని బోటింగ్ వివరాలను ఉంచారు. ఇంకా ఉమ్మడి నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చలసోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయం వివరాలను పొందుపరచాల్సి ఉంది.
News January 20, 2025
యాదగిరి నర్సన్నకు దండిగా నిత్య ఆదాయం
యాదగిరి నర్సన్న ఆలయానికి ఆదివారం భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు. 2700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,35,000, ప్రసాద విక్రయాలు రూ.20,62,120, VIP దర్శనాలు రూ.9,75,000, బ్రేక్ దర్శనాలు రూ.4,70,100, కార్ పార్కింగ్ రూ.6,50,000, వ్రతాలు రూ.1,38,400, యాదరుషి నిలయం రూ.2,71,187, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.51,40,252 ఆదాయం వచ్చింది.
News January 19, 2025
జాన్‌పహడ్ సైదన్న జాతరకు వేళాయే
మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్‌పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.