News December 30, 2024
NLG: అతడు అడవిని సృష్టించాడు

ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.
Similar News
News November 25, 2025
NLG: రిజర్వేషన్లు.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన జీవో 46 ద్వారా ఖరారు చేసిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లతో సీట్లు తారుమారై అలజడి రేపింది. గ్రామాల్లో ఉన్న జనాభా ధామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో ఈ సారి తమకే రిజర్వేషన్ ఖరారవుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించిన నాయకులకు రిజర్వేషన్ల మార్పులతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్లు కొందరి జాతకాలను తారుమారు చేశాయి.
News November 25, 2025
జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
News November 25, 2025
NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.


