News May 19, 2024

NLG: అదే ఉత్సాహంతో పని చేయాలి: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్ గా ఉండాలన్నారు .

Similar News

News December 13, 2024

గడ్కరీతో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీ

image

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ వద్ద పెండింగ్‌లో ఉన్న టెక్నికల్, ఫైనాన్షియల్ అప్రూవల్‌ను ఆమోదించి పనులు ప్రారంభించాలని గడ్కరీని కోరారు.

News December 12, 2024

NLG: లవ్ మ్యారేజ్.. యువకుడి సూసైడ్

image

రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చిట్యాలలో జరిగింది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాలు.. స్థానిక వెంటాపురానికి చెందిన రబోయిన మహేష్(26) రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్ధలతో వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మహేష్ గురువారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News December 12, 2024

NLG: మంత్రి పదవి వీరిలో ఎవరికి..!

image

త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉమ్మడి NLG జిల్లా నుంచి రేవంత్  క్యాబినెట్‌లో బెర్త్ ఎవరికి అనే చర్చ నడుస్తోంది. ST సామాజిక వర్గానికి చెందిన MLA బాలు నాయక్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన MLA రాజగోపాల్ రెడ్డి, బీసీ MLA ఐలయ్య జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ముందున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వీరిలో ఎవరు మంత్రి అవుతారో కామెంట్ చేయండి.