News October 5, 2024

NLG: అరిచాడని భర్త తల పగలగొట్టింది..!

image

భర్త తలను భార్య పగలగొట్టిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి శివ కాంట్రాక్టర్‌. కాగా భార్య, పిల్లలతో కలిసి KPHB రోడ్డు NO.3లో ఉంటున్నాడు. శుక్రవారం శివ స్నానం చేసే టైంలో వీపు తోమాలని భార్యపై అరిచాడు. ‘ఇరుగు పొరుగు వారు వింటే ఇజ్జత్ పోతుంది.. ఎందుకలా అరుస్తున్నావ్’అంటూ క్షణికావేశంలో రాయితో భర్త తల పగలగొట్టగా రక్తస్రావమైంది. అనంతరం శివ PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 9, 2025

ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్‌గా చెక్ చేయాలని సూచించారు.

News December 9, 2025

ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం: నల్గొండ ఎస్పీ

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను మోహరించామని చెప్పారు. 1141 మంది పాత నేరస్తులు, రౌడీషీటర్లను బైండోవర్ చేసి వారి కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో గుంపులు, మొబైల్ ఫోన్లు, ప్రలోభపరిచే చర్యలు నిషేధం అని హెచ్చరించారు.

News December 9, 2025

నల్గొండ జిల్లాలో సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్‌కు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారి కొర్రా లక్ష్మీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో మంగళవారం 7,892 మంది అధికారులకు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. నల్గొండ, చండూరు డివిజన్లలోని 14 మండలాల్లోని 2,870 కేంద్రాల్లో వీరు విధులు నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు.