News September 15, 2024

NLG: ‘ఆకతాయిలు వేధిస్తే 100కు కాల్ చేయండి’

image

స్కూల్ కాలేజీలో ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే100కు కాల్ చేయాలని షీటీం ఏఎస్‌ఐ షరీఫ్ ప్రభాకర్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఓ పాఠశాలలో షీ టీంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆడ పిల్లలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒకసారి కేసు బుక్‌ అయితే జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతారని విద్యార్థులకు తెలిపారు.

Similar News

News October 6, 2024

బెల్ట్ షాపులు తీసేస్తే రూ.10 లక్షలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులు నిర్మూలించిన గ్రామాలకు వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బెల్ట్ షాపుల నిర్మూలనతో గ్రామంలోని వారు మద్యం సేవించకుండా పని చేసుకుంటున్నారని ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు. అంతేకాకుండా బెల్ట్ షాపుల మూసివేతకు పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

News October 6, 2024

నల్గొండ: ఐటీఐలో కొత్త కోర్సులకు అడ్మిషన్లు

image

2024-25 విద్యా సంవత్సరంలో ఐటీఐలో కొత్తగా ప్రారంభించిన కోర్సులకు 6వ దశ వాక్ ఇన్ అడ్మిషన్లు ఈ నెల 9వరకు జరుగుతాయని ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) ప్రిన్సిపల్ ఎ.నర్సింహాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు అర్హులని పేర్కొ న్నారు. అభ్యర్థులు https://iti.telangana.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 9వ తేదీలో హాజరు కావాలని తెలిపారు.

News October 6, 2024

నల్గొండ బైపాస్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

image

నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 నుంచి 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైపాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండగా రోడ్డుపై పెట్టిన బారికేడ్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.