News April 6, 2024

NLG: ఆదర్శ పాఠశాలలో పరీక్ష తేదీల ఖరారు

image

మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 7న ఆన్ లైన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10గం.ల నుంచి 12గం.ల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2గంల నుంచి 4గం.ల వరకు 7- 10వ తరగతుల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ స్వరూప రాణి తెలిపారు.

Similar News

News January 18, 2025

నర్సన్న నిత్య ఆదాయం రూ.35,63,82

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం 1260 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.63,000, ప్రసాద విక్రయాలు రూ.11,51,690, VIP దర్శనాలు రూ.3,75,000, బ్రేక్ దర్శనాలు రూ.1,80,300, కార్ పార్కింగ్ రూ.4,50,000, వ్రతాలు రూ.80,800, సువర్ణ పుష్పార్చన రూ.79,432, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,63,824 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.

News January 17, 2025

మిర్యాలగూడ: ఆ కుటుంబంలో ఆరుగురు DOCTORS

image

నల్గొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన రామారావు-జీవనజ్యోతి దంపతులు ఇద్దరు డాక్టర్‌లే. వీరు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే గొప్పవిషయం ఏంటంటే.. వీరి ఇద్దరు కుమారులు శ్రీహర్ష, పృథ్వి, కోడళ్లు అమూల్య, శ్రావ్య కూడా డాక్టర్‌లే. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైద్య వృత్తిలో ఉండటం అరుదుగా కనిపిస్తుంది.

News January 16, 2025

NLG: షిరిడీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!

image

షిరిడీ సమీపంలో జరిగిన <<15171774>>ఘోర రోడ్డు ప్రమాదం<<>>లో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కొండగడపలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రెండు రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. నిన్న ఉదయం దర్శనాంతరం తుఫాన్ వాహనంలో సమీప దర్శనీయ స్థలాలు చూసేందుకు వెళ్లి తిరిగి షిరిడీకి వస్తుండగా వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మీ(45), అక్షిత(20), వైద్విక్ నందన్(6నెలలు) మృతి చెందారు.