News July 2, 2024

NLG: ఆమెకు పుట్టిన రోజే చివరి రోజైంది

image

తల్లిగారింట్లో పుట్టిన‌రోజు చేసుకోవాలని వచ్చిన వివాహిత అదేరోజు కరెంట్ షాక్‌తో మృతిచెందిన ఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం.. రాజపేట మండలం పారుపల్లి వాసి భూపతి సురేశ్, బాలాంజలి దంపతులు. సోమవారం బర్త్ డే సందర్భంగా పిల్లలు, భర్తతో కలిసి గౌరాయిపల్లికి వచ్చింది. బట్టలు ఉతుకుతుండగా కరెంట్ షాక్‌కు గురైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.

News December 3, 2025

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని అన్నారు.

News December 3, 2025

చిట్యాల: ఇంటి పన్ను వసూళ్లు రికార్డు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 13,97,355 వసూలు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. అత్యధికంగా వెలిమినేడులో రూ. 2,70,575 వసూలు కాగా, బొంగోనిచెరువు, గుండ్రాంపల్లిలలో కూడా భారీగా పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగానే ఈ స్థాయిలో వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.