News October 8, 2024

NLG: ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

RTI ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరపత్రం ఆవిష్కరించించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్యర్ల సత్యనారాయణ, సైదులు, మేఖల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు పాల్గొన్నారు.

Similar News

News March 6, 2026

నల్గొండలో భానుడి ప్రతాపం

image

నల్గొండ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. గత నెల 15 నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం గరిష్ఠంగా 36.5 డిగ్రీలకు చేరాయి. మధ్యాహ్నం వేళ భానుడి సెగలకు జనం అల్లాడిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

News March 6, 2026

డిజిటల్ క్రాప్ సర్వే.. వాలంటీర్లకు అద్భుత అవకాశం

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేలో వాలంటీర్లుగా పనిచేసేందుకు గ్రామీణ నిరుద్యోగ యువతకు అవకాశం లభించింది. జిల్లాలోని 12 లక్షల ఎకరాల్లో 5 లక్షల మంది రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణే ఈ సర్వే లక్ష్యం. ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో నియామకాలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో ఆసక్తి గల యువకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (DAO) శ్రవణ్ కుమార్ కోరారు.

News March 6, 2026

మిల్లర్ల పిటిషన్ పై విచారణ 18కి వాయిదా

image

జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.191 కోట్ల ధాన్యం మాయం కేసులో మిల్లర్ల క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. జిల్లాలోని 7 మిల్లుల్లో సుమారు 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. తమపై నమోదైన కేసులు చెల్లవని, వాటిని కొట్టివేయాలని కోరుతూ ఐదు మిల్లుల నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.