News January 20, 2025
NLG: ఆసరా కోసం ఎదురుచూపులు!

ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. సదరం సర్టిఫికెట్లు జారీ చేసి రెండేళ్లు దాటినా ఇంకా తమకు పెన్షన్ రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో సర్టిఫికెట్ గడువు ముగుస్తుందని చెబుతున్నారు. కాగా ఒక్క నల్గొండ మున్సిపాలిటీలోనే పెన్షన్ల కోసం 3 వేలమందికి పైగా అప్లై చేసుకున్నారు. తమకూ పెన్షన్ ఇవ్వాలని సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని లబ్ధిదారులు కోరుతున్నారు.
Similar News
News February 17, 2025
కట్టంగూర్: జేఈఈ ఫలితాల్లో 91.38 % సాధించిన సిరి

కట్టంగూర్ మండలం ఐటి పాముల గ్రామపంచాయతీ పరిధి గంగాదేవి గూడెంకి చెందిన కంబాలపల్లి సిరి ఇటీవలే విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో 91.38% సాధించింది. ఐటిపాముల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సిరి ప్రస్తుతం నల్గొండలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సిరి 91.38% సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News February 17, 2025
దేవరకొండ: మద్యం మత్తులో యువకుడిపై దాడి

మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన దేవరకొండలో జరిగింది. సీఐ నర్పింహులు ప్రకారం.. T.పాత్లావాత్‌తండాకు చెందిన శరత్ ఇంటి ముందు నుంచి ఓ యువకుడు రెండు, మూడు సార్లు నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న శరత్ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావంటూ కోపంతో కత్తితో దాడి చేశాడు. గాయాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News February 16, 2025
పెద్దగట్టు జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టం

యాదవుల కులదైవమైన ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభమైంది. మేడారం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర సమ్మక్క-సారలమ్మ జాతరలాగే 2ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమాన్ని ఈరోజు అర్ధరాత్రి నిర్వహించనున్నారు. కాగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.