News April 12, 2025
NLG: ఆస్తికోసం కూతురిని చంపిన సవతి తల్లి

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్‌కు నోచుకోని గ్రామాలు!

నల్గొండ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్‌పల్లి, నిడమనూర్, గుండ్రంపల్లి, వెలిమనేడు, పెద్ద కాపార్తి, పెద్దదేవులపల్లి, ముత్యాలమ్మ గూడెం, చందంపేట, పులిచెర్ల, దాచారం , అంగడిపేట, వీర్లపాలెం, పగిడిమర్రి, కొండూరు, ఎర్రగండ్లపల్లి ఇలా దాదాపు 27 పంచాయతీలకు ఒక్కసారి కూడా సర్పంచ్ SC రిజర్వ్ కాలేదు.
News December 2, 2025
నల్గొండ: రెండో దశకు నేటితో తెర..!

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 1,703 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, BRS నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.
News December 2, 2025
నల్గొండ: రేపు మూడో విడత నోటిఫికేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే NLG, CDR డివిజన్లలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.


