News January 21, 2025
NLG: ఆస్తులు అమ్మి పంపాం: రవితేజ తండ్రి

అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో NLG జిల్లాకు చెందిన రవితేజ <<15210729>>దారుణ హత్యకు<<>> గురైన సంగతి తెలిసిందే. ‘HYDలో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాను. ఉన్న పొలాన్ని మొత్తం అమ్మి రవితేజను ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా పంపాం. MS పూర్తి చేసిన రవితేజ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తాత్కాలికంగా ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది’ అని రవితేజ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.