News April 22, 2025

NLG: ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తులకు ఇవాళే లాస్ట్

image

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2వ దశ దరఖాస్తు గడువు ఇవాల్టి వరకు పొడిగించినట్లు నల్గొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ వి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5,000 మంజూరు చేస్తారని తెలిపారు. 12 నెలల ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 22, 2025

పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్‌ను సన్మానించిన ఎస్పీ

image

పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.

News April 22, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

☞ ఫస్ట్ ఇయర్‌లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్

News April 22, 2025

ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

image

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.

error: Content is protected !!