News February 6, 2025

NLG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 357 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు బుధవారం 357 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు మొత్తం 2760 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2507 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్‌కు 1985 మంది హాజరుకావాల్సి ఉండగా 1881 మంది పరీక్ష రాశారు. 104 మంది గైర్హాజరయ్యారు.

Similar News

News October 27, 2025

ALERT.. నల్గొండ జిల్లాపై ‘మొంథా’ ప్రభావం

image

రానున్న 2,3 రోజులు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దన్నారు.

News October 26, 2025

NLG: జిల్లాలో 5.1 సగటు వర్షపాతం

image

అల్పపీడన ద్రోణి కారణంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో 5.1 మిల్లీమీటర్ల సగటు వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా కొండమల్లేపల్లి మండలంలో 26.5 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లిలో 11.6, మర్రిగూడలో 3.7, మునుగోడులో 10.6, గుడిపల్లిలో 12.5, పీఏ పల్లిలో 19.3, గుర్రంపోడులో 21.1, చిట్యాలలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News October 26, 2025

పత్తిని ఇక్కడ అమ్ముకుంటేనే లాభం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

image

జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,68,778 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని.. జిల్లావ్యాప్తంగా 57,23,951 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఆయన తెలిపారు.