News March 23, 2025
NLG: ఇంటిగ్రేటెడ్ IPC కోర్స్‌తో ఉజ్వల భవిష్యత్తు: VC

ఇంటిగ్రేటెడ్ ఐపీసీ కోర్స్‌తో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ అల్తాన్ హుసేన్ అన్నారు. రీసెర్చ్ అడ్వాన్స్ ఇన్ ఫార్మాటికల్ సెమినార్లో భాగంగా ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ IPC కోర్సుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కోర్సు పూర్తి చేసిన పూర్వ విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీల అధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వినతులను స్వీకరించారు. సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీస్ సేవలు అందజేయాలని ఎస్పీ సూచించారు.
News November 24, 2025
NLG: 30వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

జిల్లాలో వివిధ రకాల చేయూత / ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పింఛన్లు) నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. పెన్షన్ దారులు పెన్షన్ మొత్తాన్ని నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుంచి పొందాలని సూచించారు.
News November 24, 2025
NLG: ఏర్పాట్లు వేగవంతం… సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టి సారిస్తున్నారు.


