News January 29, 2025
NLG: ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపిక

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన ధనావత్ వస్రాంనాయక్ దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకి సెలెక్ట్ అయ్యారు. బోర్డ్ అఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 నుంచి 20 తేదీ వరకు నేపాల్లో జరిగే మూడు T-20, 2 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల సిరీస్లో ఇండియా తరఫున ఆడనున్నారు. వస్త్రాంనాయక్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Similar News
News November 16, 2025
పార్వతీపురం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల అహ్వానం

సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి అప్పన్న శనివారం తెలిపారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తును పార్వతీపురంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయానికి నవంబర్ 25లోగా సమర్పించాలన్నారు.
News November 16, 2025
పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.
News November 16, 2025
కామారెడ్డి: కన్న ఊరును వీడిన ‘బతుకు బండి’

చెరుకు సీజన్ షురూ కావడంతో గిరిజన ప్రాంతాల నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే, ఈ ఏడాది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరిజనులు ఉపాధి నిమిత్తం కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి పయనమయ్యారు. ఉగాది పండుగ సమయానికి తిరిగి తమ సొంతూళ్లకు చేరుకుంటారు. సంగారెడ్డి జిల్లా వాసులు ఎడ్ల బండ్లు కట్టుకుని, తమ సామగ్రిని తీసుకుని పిట్లం మీదుగా శనివారం వెళ్తుండగా.. ‘Way2News’ క్లిక్ మనిపించిన దృశ్యమిది.


