News December 19, 2024

NLG: ‘ఇందిరమ్మ’ సర్వేను వెంటాడుతున్న సమస్యలు

image

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్ సతాయింపుతో పాటు.. గ్రామాల్లో నెట్ సక్రమంగా అందకపోవడంతో సర్వేకు సమస్యగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 4,31,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 67 వేల ఇండ్లను మాత్రమే సర్వే చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. సర్వేను సమస్యలు వెక్కిరిస్తున్నాయి.

Similar News

News December 18, 2025

NLG: ముగిసిన పల్లె సంగ్రామం

image

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.

News December 18, 2025

పీఏ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ బాయి

image

మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పీఏ పల్లి మండలం అంకంపేట, అంగడిపేటలో విధులు నిర్వహించిన మహిళా ఎస్సై విజయబాయి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు, వయోవృద్ధులను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి స్వయంగా పోలింగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లింది. నిధి నిర్వహణలో ఉండి కూడా వృద్ధులు, వికలాంగులకు చేయూతనివ్వడం పట్ల పలువురు ఎస్సై విజయ బాయిని అభినందించారు.

News December 17, 2025

నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

image

నేరేడుగొమ్ము మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో మొదటి ఫలితం వెలువడింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన బాబుపై 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు.