News December 19, 2024

NLG: ‘ఇందిరమ్మ’ సర్వేను వెంటాడుతున్న సమస్యలు

image

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్ సతాయింపుతో పాటు.. గ్రామాల్లో నెట్ సక్రమంగా అందకపోవడంతో సర్వేకు సమస్యగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 4,31,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 67 వేల ఇండ్లను మాత్రమే సర్వే చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. సర్వేను సమస్యలు వెక్కిరిస్తున్నాయి.

Similar News

News January 16, 2025

NLG: షిరిడీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే!

image

షిరిడీ సమీపంలో జరిగిన <<15171774>>ఘోర రోడ్డు ప్రమాదం<<>>లో జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కొండగడపలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రెండు రోజుల క్రితం షిరిడీకి వెళ్లారు. నిన్న ఉదయం దర్శనాంతరం తుఫాన్ వాహనంలో సమీప దర్శనీయ స్థలాలు చూసేందుకు వెళ్లి తిరిగి షిరిడీకి వస్తుండగా వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమలత(59), ప్రసన్న లక్ష్మీ(45), అక్షిత(20), వైద్విక్ నందన్(6నెలలు) మృతి చెందారు.

News January 16, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు భువనగిరి జిల్లా వాసులు మృతి

image

మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భువనగిరి జిల్లా వాసులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులు మోత్కూర్ మున్సిపాలిటీలో పరిధిలోని కొండగడప వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉంది. రెండు రోజుల క్రితం వీరు షిరిడీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.

News January 16, 2025

NLG: ప్రధాని మోదీతో మచ్చటించిన అంజలి

image

గుర్రంపోడు మండలం ఆములూరుకు చెందిన కటికర్ల శంకర్ పార్వతమ్మ దంపతుల కుమార్తె అంజలి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి హాజరయ్యింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అంజలి తన ప్రతిభా పాటవాలతో ఎన్‌సీఈఆర్‌టీ సహకారంతో ఢిల్లీ వెళ్లి ప్రధానితో మోదీతో ముచ్చటించింది. దీంతో ఆములూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అంజలిని అభినందించారు.