News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News October 23, 2025
ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్…రయ్…

AP: రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగెత్తనున్నాయి. కేంద్రం చేపట్టే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు AP మీదుగా వెళ్లనున్నాయి. HYD-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 263 KM మేర వెళ్లనుంది. HYD-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి జిల్లాల్లో 504 KM మేర వెళ్తుంది. ఈ రూట్లలో 15 స్టేషన్లు ఏర్పాటుకానుండడంతో జర్నీటైమ్ తగ్గనుంది.
News October 23, 2025
సోయా పంట కొనుగోలు ఎప్పుడు?

TG: ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 62,500 ఎకరాల్లో సోయా పంటను రైతులు సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట చేతికొచ్చి 15 రోజులు దాటింది. ఏటా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. పంట సేకరిస్తుండగా ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సోయాకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,328గా ఉంది. వర్షాలతో కొంత పంట నష్టపోయామని, మిగిలిన పంటనైనా ప్రభుత్వం త్వరగా కొనాలని రైతులు కోరుతున్నారు.
News October 23, 2025
ఆదిలాబాద్ TO అరుణాచలానికి RTC బస్సు

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి తమిళనాడు అరుణాచలం గిరిప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డీఎం ప్రతిమా రెడ్డి తెలిపారు. ఈ బస్సు నవంబర్ 8న బయలుదేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు జోగులాంబ దేవాలయం చూసుకొని నవంబర్ 11న రాత్రి 10 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.