News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్‌లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News March 15, 2025
గుర్రంపూడ్: గ్రూప్-3లో మెరిసిన కానిస్టేబుల్

గుర్రంపూడ్ మండలం కొప్పోల్ గ్రామానికి శంకర్ గ్రూప్ -3లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూపు-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూపు-2 ఫలితాలలో 674వ ర్యాంక్, గ్రూప్ -3 ఫలితాలలో 165వ ర్యాంకు సాధించాడు. దీంతో శంకర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి
News March 15, 2025
NLG: ఓపెన్ డిగ్రీ చదివి గ్రూప్స్ సాధించాడు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన గ్రూప్-2 గ్రూప్-3 ఫలితాలలో దామరచర్ల మండలం తాళ్ల వీరప్పగూడెం గ్రామానికి చెందిన పెండెం సందీప్ సత్తా చాటారు. గ్రూప్-2 ఫలితాలలో 85వ ర్యాంక్, గ్రూప్-3లో 50 ర్యాంక్ సాధించారు. గీత కార్మికుల కుటుంబానికి చెందిన సందీప్ ఓపెన్ డిగ్రీ చదివి గ్రూప్ ఫలితాలలో సత్తా చాటడం పట్ల అతని తల్లిదండ్రులు శ్రీను, సాయమ్మ గ్రామస్థులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
News March 14, 2025
మఠంపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు శుక్రవారం అంబారాన్నంటాయి. ఈ మేరకు ఉదయం నుంచే యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు రంగులు పూసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం హోలీ.. హోలీ.. హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.