News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News November 5, 2025
పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్‌ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News November 5, 2025
MDK: వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ ❤️

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద కార్తీక పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఒకే ఫ్రేమ్‌లోకి చంద్రుడు, ఆలయం, అమ్మవారి విగ్రహం రావడంతో ఈ సుందర దృశ్యాన్ని భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.


