News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్‌లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News April 17, 2025
బషీర్‌బాగ్: ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్

బషీర్‌బాగ్‌లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.
News April 17, 2025
గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
News April 17, 2025
ఒంగోలు: బ్రోచర్లను ఆవిష్కరించిన కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్‌లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర శక్తి యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.