News March 10, 2025
NLG: ఇప్పుడే ఇలా.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అప్పుడే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండు వేసవికి ముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాక ముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 36.21 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. ఐదు రోజులుగా జిల్లాలో క్రమంగా 3.0 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News April 10, 2026
నల్గొండ: లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి – కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.
News April 10, 2026
NLG: చిగురిస్తున్న ‘చేయూత’ ఆశలు

జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి ‘చేయూత’ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరిగిన ‘ప్రజా పాలన’ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82,115 దరఖాస్తులు అందగా, ప్రస్తుతం అధికారులు అర్హతలను బట్టి వడపోత ప్రక్రియను వేగవంతం చేశారు. ఒక్కో జిల్లాకు సుమారు 10 వేల నుంచి 15 వేల వరకు కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది.
News April 10, 2026
NLG: మీరు గేదెల పథకానికి దరఖాస్తు చేయలేదా?

జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశం కల్పించింది. రివైజ్డ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద అమలు చేస్తున్న రెండు పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన వారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.


