News March 19, 2025
NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News April 24, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిపేందుకు చర్యలు

అందరూ సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలం గుట్టకింది అన్నారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లర్లతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులు కూడా కేంద్రం సిబ్బందికి సహకరించాలని సూచించారు.
News April 23, 2025
HYD – WGL హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ వద్ద కారు ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆలేరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నర్సింగ్ బట్లకి చెందిన రవి (30) పెళ్లి మండపం కట్టడానికి మంగళవారం రాత్రి మిర్యాలగూడ వెళ్లాడు. ఈ తెల్లవారుజామున బైక్‌పై తిరిగి వస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు. అతని పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ఆస్పత్రికి తరలించారు.