News January 29, 2025

NLG: ఉచిత శిక్షణకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 9

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అర్హులైన BS, EBC, SC, ST అభ్యర్థులకు SSC, RRB, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం సంచాలకుడు ఖాజా నజీమ్ అలీ అఫ్సర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News July 8, 2025

ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

News July 8, 2025

NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

image

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

News July 8, 2025

NLG: రైతులకు యూరియా కష్టాలు ఇంకెన్నాళ్లు!?

image

నల్గొండ జిల్లాలోని రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు.