News August 13, 2024
NLG: ఉద్యోగులకు ఇక అటెండెన్స్ యాప్.!
సెప్టెంబర్ 1 నుంచి జిల్లా మొదలుకొని గ్రామపంచాయతీ వరకు ఉద్యోగులకు అటెండెన్స్ యాప్‌ను నిర్వహించనున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సమయానుకూలంగా పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News September 18, 2024
యాదగిరిగుట్ట: వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన ఏసీపీ
యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎరుకలి సుధా హేమేందర్ గౌడ్, సీఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
News September 18, 2024
యాదాద్రి: నిమజ్జనానికి వెళ్లి యువకుడి మృతి
వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (27) వినాయక నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెందాడు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు మృతిచెందడంతో అతడి మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News September 18, 2024
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’
రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.