News December 3, 2024

NLG: ఉపసర్పంచ్‌ చెక్ పవర్ తొలగిస్తే పోటీ ఉంటుందా!

image

సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీరాజ్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ తొలగింపు. సర్పంచ్ అవ్వాలనుకున్నవారు పోటీ చేసే అవకాశం రాకపోతే కనీసం ఉప సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం చెక్ పవర్ తొలగింపు నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి NLG జిల్లాలో సర్పంచ్ పదవి కోరుకునే వారికి ఇంట్రస్ట్ ఉంటుందా.. మీరేమంటారు..

Similar News

News February 28, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. నాలుగో రోజు 281 మంది గైర్హాజరు

image

జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 281 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 11,050, మంది విద్యార్థులకు గాను 10, 839మంది హాజరుకాగా, 211 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,884 మంది విద్యార్థులకు గాను 1,814 మంది హాజరుకాగా, 70 మంది గైర్హాజరయ్యారు.

News February 28, 2026

నల్గొండ: మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ

image

జిల్లా మహిళా ప్రాంగణంలో ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ప్రారంభం కానున్నట్లు మేనేజర్ అనిత తెలిపారు. 18-35 ఏళ్లలోపు వయస్సు ఉండి, కనీసం 8వ తరగతి చదివిన మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు రెండు ఫోటోలు, ఆధార్‌ కార్డుతో కార్యాలయంలో సంప్రదించాలి. ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

News February 28, 2026

నల్లగొండ: 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

image

జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీపడదగ్గ క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, భూ తగాదాలు వంటి పెండింగ్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ తెలిపారు. అప్పీలుకు తావులేని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.