News June 21, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో డిగ్రీ డీలా..!

image

ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. డిగ్రీ సంప్రదాయ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు . ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కాలేజీలు నేడు వెలవెలబోతున్నాయి. MG యూనివర్సిటీ పరిధిలో 62 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 24 వేల సీట్లు ఉన్నాయి. 2 విడతల్లో దోస్త్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించినా 16 శాతం కూడా అడ్మిషన్లు దాటలేదు.

Similar News

News December 10, 2025

NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

image

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది

News December 10, 2025

NLG: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా తుంగతుర్తిలో గుడితండకు చెందిన జైపాల్ నాయక్, రుస్తాపురానికి చెందిన శ్రీహరికుమార్ బాండు పేపర్ రాసిచ్చిన విషయం తెలిసిందే. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.

News December 10, 2025

NLG: 829 జీపీల్లో రేపే పోలింగ్

image

జిల్లాలో మూడు విడతల్లో 869 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి మంగళవారం ప్రచార ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.