News January 13, 2025

NLG: ఉమ్మడి జిల్లాలో భోగి సంబురం

image

మూడు రోజుల సంక్రాంతి పండగకు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో మహిళలు వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. తీపి వంటకాల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పల్లెల్లో ఉదయమే భోగిమంటలతో ప్రజలు పండుగకు ఆహ్వానం పలికారు. మరోవైపు చిన్నారులు పతంగులు ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Similar News

News November 20, 2025

NLG: వామ్మో కోతులు

image

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.

News November 20, 2025

గ్రామాల్లో నేటి నుంచి చీరలు పంపిణీ

image

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గ్రామాల్లో గురువారం నుంచి పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో 3,66,532 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.

News November 20, 2025

NLG: పైలట్ ప్రాజెక్టుగా 70 గ్రామాలు ఎంపిక!

image

నల్గొండ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం భూభారతిలో పక్కాగా హద్దులు తేల్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సర్వే కోసం జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో 8,627 సర్వేనెంబర్‌ల పరిధిలో 72,758.7 ఎకరాల భూమిని సర్వే చేసి లెక్కలు తేల్చనున్నారు. రెసిడెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా సర్వే జరిపి అనంతరం ఆ వివరాలను భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు.