News July 4, 2024
NLG: ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతమే!

వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది. దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. గతేడాది ఇదే సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. చాలా ప్రాంతాల్లో విత్తనాలు నాటిన తర్వాత వర్షం లేకపోవడంతో అవి ఎండిపోయే దశకు చేరాయి.
Similar News
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.