News October 11, 2024
NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు పాటు మహిళలు తీరక్క పూలతో బతుకమ్మలు తయారుచేసి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలతో బతుకమ్మలు ఆడారు. చివరి రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా ఊరూరా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు,కుంటలలో నిమజ్జనం చేశారు.
Similar News
News November 1, 2025
పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 1, 2025
పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.
News October 31, 2025
NLG: ఉదయం బదిలీ… మధ్యాహ్నం డిప్యూటేషన్!

నల్గొండలోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ బదిలీల వ్యవహారం కలకలం రేపుతుంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని మరో చోటికి ఉదయం బదిలీ చేసి మధ్యాహ్నం డిప్యూటేషన్ పై మళ్లీ ఇక్కడికే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే తిరిగి సదరు ఉద్యోగికి యధాతధ పోస్టు అప్పగించడంపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాలని కోరుతున్నారు.


